బాలయ్యను ఢీకొట్టే మగాడే ఇండస్ట్రీలో లేడు అంటూ కూసింత ఘాటుగా కూడా ప్రశంసించేస్తున్నారు. అయితే డాకు మహారాజ్ సినిమా హిట్ అవుతుంది అని అందరూ ముందుగానే ఊహించారు. బాబి డైరెక్షన్లో బాలయ్య సినిమా అనగానే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి. కానీ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ బాలయ్య అభిమానులను పిచ్చెక్కించేసింది. దీంతో బాలయ్య "డాకుమహారాజ్" సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫాన్స్ గెస్ చేసేసారు .
అయితే అనుకున్న దానికన్నా త్రిపుల్ స్థాయిలో ఈ సినిమా జనాలను ఆకట్టుకునేసింది . మరి ముఖ్యంగా బాలయ్య నోటి నుంచి వచ్చిన ఒకొక్క పవర్ఫుల్ డైలాగ్ బాగా ఆకట్టుకుంది. డాకు మహారాజ్ గా బాబీ ..బాలయ్యని చూపించే విధానం హైలెట్ గా మారింది. మాస్ ఎలివేషన్స్ వేరే లేవల్. వామ్మో ఒకటా రెండా పూనకాలు తెప్పించేస్తుంది ఫాన్స్ కి థియేటర్స్లలో అంటూ జనాలు బాబీ డైరెక్షన్ గురించి వేరే లెవెల్ లో మాట్లాడుకుంటున్నారు .
అయితే డాకు మహారాజ్ సినిమాకి కూడా నెగిటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాబి డైరెక్షన్ కొంచెం నిరాశపరచడం ..కామన్ రొటీన్ స్టోరీ గా ఉండడం ..ఫ్లాట్ క్లైమాక్స్ . అంతేకాదు సెకండ్ హాఫ్ మొత్తం కూడా సీన్స్ చాలా చాలా సాగదీశాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే డాకు మహారాజ్ సినిమాకి నెగిటివ్ పాయింట్స్ వినిపించిన సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ కారణం మాత్రం డైలాగ్స్. బాలయ్య డాకు మహారాజుగా నటించిన విధానం థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పూనకలు తెప్పించేస్తుంది . ఈ సినిమాకి మరీ ముఖ్యంగా ప్లస్ అయింది హై స్పీడ్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవాలి . ఇది చాలా చాలా స్పెషల్ . దర్శకుడు బాబి రొటీన్ కధని..ఈ హై స్పీడ్ స్క్రీన్ ప్లే నే మలుపు తిప్పింది . మాస్ ఆడియన్స్ ని పిచ్చెక్కించేలా ఆరేడు బ్లాకులు భలే సినిమాని కవర్ చేశాయి . ఇది నిజంగా బాలయ్య మాస్ ఫాన్స్ కు పండుగనే చెప్పాలి . సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కారణం కూడా ఇదే అంటున్నారు జనాలు..!