కాగా "గేమ్ చేంజర్" సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే థియేటర్స్లలో బాలయ్య నటించిన "డాకు మహారాజ్" సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. మరి ముఖ్యంగా బాలయ్య పర్ఫామెన్స్ కు వేరే లెవెల్ మార్కులు పడుతున్నాయి. కధ అందరికీ తెలిసిందే అయినా క్యారెక్టర్ ని మాత్రం బాబి బాగా డిజైన్ చేశాడు అని .. మరి ముఖ్యంగా 'నానాజీ' పాత్ర కన్నా 'డాకు మహారాజ్' పాత్ర సినిమాకి బాగా ప్లస్ అయింది అని చెప్పుకొస్తున్నారు.
సినిమాలో ప్రతి ఒక్కరు కూడా తమ క్యారెక్టర్ కు తగ్గ నటనను కనబరిచారు అని . మరి ముఖ్యంగా బాబి డియోల్ పాత్ర బాగా ఆకట్టుకునింది అని చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఫాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . "గేమ్ చేంజర్" సినిమా "డాకు మహారాజ్".. సినిమా ఈ రెండిట్లో ఏది బెస్ట్ ..? ఏ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు ..? ఏ సినిమాతో ఫ్యామిలీకి వెళ్లొచ్చు..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు . అయితే దానికి తగ్గట్టే ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు .
మెగా ఫాన్స్ 'గేమ్ చేంజఋ సినిమా అంటుంటే .. నందమూరి ఫ్యాన్స్ "డాకు మహారాజ్" అంటున్నారు . అయితే రెండు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి . ఎక్కడ కూడా వల్గర్ సీన్స్ అనేటివి పెద్దగా లేవు. రెండు సినిమాలు కూడా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే సీన్స్ . కాగా ప్రజెంట్ రాజకీయాలలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి అయితే 'గేమ్ చేంజఋ సినిమాకి వెళ్లొచ్చు అని.. కొంచెం సేపు వర్క్ స్ట్రెస్ తగ్గించుకుని.. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే "డాకు మహారాజ్" సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అని డిఫరెంట్ డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ "గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్" మూవీ టాక్ వైరల్ గా మారింది..!