కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె నటనకు మంచి మార్కులు వేయించుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . థియేటర్లలో పెద్ద స్క్రీన్ పై బాలయ్యను మాస్ యాంగిల్ లో చూస్తూ బ్యాక్ గ్రౌండ్ లో తమన్ బిజిఎం వింటుంటే మాత్రం వేరే లెవెల్ అంటూ ఈ సినిమా విజయానికి తమన్ కూడా ఒక కారణమే అంటూ పొగిడేస్తున్నారు. . అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు . అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అందులో నో డౌట్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు .
కానీ సినిమాలో వచ్చే సీన్స్ ముందుగానే ప్రిడిక్ట్ చేసే విధంగా ఉన్నాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. బాలయ్య సినిమా అంటే సీన్స్ వేరే లెవెల్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం . అసలు ఊహకందని సీన్స్ ఎన్నెన్నో ఊహించుకుంటాం. కానీ "డాకు మహారాజు"లో మాత్రం అలా చేయలేం. థియేటర్లలో ఒక సినిమా వస్తుంది అంటే దాని వెనక సీన్ ఇదే అని కామన్ పీపుల్ కూడా గెస్ చేసే విధంగా బాబీ రాసుకున్న కొన్ని సీన్స్ సినిమాకి మైనస్ గా మారాయి అంటున్నారు జనాలు. హై యాక్షన్ మూమెంట్స్ తో కొన్ని సీన్స్ పిచ్చెక్కించిన కొన్ని కొన్ని సీన్స్ మాత్రం చాలా స్లోగా జనాలు ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండడం కూసింత డిసప్పాయింట్ చేసే విషయం అని చెప్పాలి . "డాకు మహారాజ్" సినిమా ఇంత పెద్ద హిట్టు అందుకున్న రివ్యూవర్స్ మాత్రం ఆ సాగదీసే సీన్స్ ని నెగిటివ్ గా చూపిస్తూ రివ్యూస్ ఇస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ "డాకు మహారాజు" సినిమా రివ్యూ వైరల్ గా మారింది..!