- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణను డాకు మహారాజ్ అంటూ బాబీ ఈ రోజు తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చారు. 16 నెల‌ల త‌ర్వాత బాల‌య్య సినిమా రావ‌డంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. సోష‌ల్ మీడియా లో ప్రీమియ‌ర్ల త‌ర్వాత సినిమాకు మంచి పాజిటివ్ టాక్ అయితే వ‌చ్చేసింది. ఇక సోష‌ల్ మీడియా లో ఇప్పుడు డాకూ హంగామా న‌డుస్తోంది. మెజార్టీ జ‌నాలు అయితే  డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని .. ఫ్లాష్ బ్యాక్, సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లే కాస్త ల్యాగ్ అయ్యాయ‌ని .. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్ గా.. అది కూడా హడావిడి గా బాబి ముగించేశాడంటున్నారు.


అయితే ఒక్క విష‌యంలో మాత్రం బాబి బోయ‌పాటిని మించి పోయాడంటున్నారు. బాలయ్య కోసం రాసుకున్న సీన్లు, బాబీ ఇచ్చిన ఎలివేషన్లు అదిరిపోయాయి. మామూలుగా అయితే బోయ‌పాటి త‌న‌దైన మాస్ సెంటిమెంట్ సీన్లు ఎలివేట్ చేస్తూ త‌న సినిమాల్లో బాల‌య్య పాత్ర‌ను హైలెట్ చేస్తుంటారు. బోయ‌పాటి ది ఊర‌మాస్ స్టైల్ అయితే .. బాబి త‌న‌దైన క్లాస్ స్టైల్లో బాల‌య్య మాస్ పాత్ర‌ను .. అందులోనూ డాకూ మ‌హారాజ్ పాత్ర‌ను ఎలివేట్ చేసిన తీరుకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయిపోయారు.


బాలయ్యని కొత్తగా చూపించడంలో బాబీ సక్సెస్ అయ్యాడని అంటున్నారు. బాలయ్యను స్టైలీష్‌గా, సటిల్డ్‌గా చూపించారని చెబుతున్నారు. మాస్ ఆడియెన్స్‌కు పిచ్చెక్కేలా సీన్లను ద‌ర్శ‌కుడు బాబి డిజైన్ చేసుకున్నాడట. కొన్ని కంప్లైంట్లు కూడా ఉన్నాయి. క‌థ తో పాటు కథనంలో మాత్రం ఎక్కడా కొత్తదనం ఉండదట. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఆడియెన్స్‌కు తెలిసి పోతుంద‌ని.. చివ‌రి 30 నిమిషాలు కూడా మ‌రీ ప్లాట్ వేసేశాడంటున్నారు. సీతారాం నుంచి డాకుకి ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యే షాట్‌లో మహారాజ్ హెడ్డుకి సీతారాం హెడ్డు సెట్ అయ్యేలా కింది నుంచి అలా షాట్ పైకి తీసుకెళ్తారు.. ఆ షాట్‌కి థియేటర్లో పూనకాలే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: