ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.  ముఖ్యంగా ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక , ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది.  ముఖ్యంగా పుష్ప , పుష్ప 2  సినిమాలతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈమె.. అటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రష్మిక కాలుకు గాయమైన విషయం తెలిసిందే. జిమ్లో కష్టపడుతున్న సమయంలో కాస్త కాలు బెణికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె కూడా ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.  కాలుకి కట్టుతో ఉన్న ఫోటోను ఆమె షేర్ చేస్తూ దర్శకులకు సారీ తెలిపింది.. నేను జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కాలుకి కాస్త గాయం అయింది.  అయితే ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను.  యాక్టింగ్ చేయడానికి నా కాలు పర్ఫెక్ట్ గా ఫిట్ అయిన తర్వాత నేను షూటింగ్ సెట్లోకి అడుగు పెడతాను. ప్రస్తుతం నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా దర్శకులు అందరికీ సారీ చెబుతున్నాను.

త్వరలోనే నేను రికవరీ అయ్యి మీ ముందుకు వస్తాను అంటూ తెలిపింది రష్మిక.  ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా షేర్ చేయడంతో ఇది చూసిన నెటిజన్స్ కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.  ఇకపోతే ప్రస్తుతం ఈమె కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, సికిందర్ వంటి చిత్రాలలో నటిస్తోంది.  ప్రస్తుతం గాయమైన కారణంగా ఈ సినిమా షూటింగ్లకు బ్రేక్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ.  ఇక త్వరగా రికవరీ అయ్యి త్వరలోనే ఈ సినిమాల షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతోంది రష్మిక.  ఏది ఏమైనా రష్మిక ఇలా బెడ్ కి పరిమితమవడంతో ఆమె అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: