నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన సినిమా 'డాకు మహారాజ్'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఇవాళ ఉదయం నుంచి ఈ సినిమా సందండి థియేటర్లలో కనిపిస్తోంది. అయితే... నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన సినిమా 'డాకు మహారాజ్' థియేటర్లలో నడుస్తోన్న క్రమంలో.. ఆయన ఫ్యాన్స్‌కు ఊహించిన షాక్‌ తగిలింది. 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్‌ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ధర్నా చేశారు. మార్కాపురం శ్రీనివాస థియేటర్ ముందు ధర్నాకు దిగారు బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ సభ్యులు.

'డాకు మహారాజ్' సినిమాపై ఇప్పటి వరకు స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  థియేటర్ యజమానులు సిండికేట్‌గా మారాయని ఫ్యాన్స్ ఆవేదన చేశారు.  కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత మార్కాపురం శ్రీనివాస థియేటర్ చర్చలు జరిపి.. సినిమా వేయడంతో... బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ సభ్యులు కాస్త చల్ల బడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.


ఇది ఇది ఇలా ఉండగా... ఇవాళ ఉదయం సినిమా రిలీజ్ కావడంతో జనాలందరూ డాకు మహారాజ్ కోసం వెళ్లారు. అయితే సినిమా చూసినవారు... అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఈ సినిమా రొటీన్ కథ అయినప్పటికీ... నందమూరి బాలయ్య యాక్టింగ్ అదరగొట్టాడని వివరిస్తున్నారు.


ముఖ్యంగా నందమూరి బాలయ్య సినిమాకు... మ్యూజిక్ అదిరిపోయింది అని చెబుతున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యాజిక్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ అంటున్నారు. ఇక మరికొంతమంది ఈ సినిమాలో ఫైటింగ్ తప్ప ఏం లేదని సెటైర్లు పెంచుతున్నారు. గేమ్ చేంజర్ తరహా లోనే... డాకు మహారాజు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన సినిమా 'డాకు మహారాజ్' కలెక్షన్లను రాబట్టడం గ్యారంటీ అంటున్నారు మరి కొంతమంది. మరి  'డాకు మహారాజ్' ఎంత మేర కలెక్షన్స్‌ తీసుకు వస్తుందో చూడాలి.



 



మరింత సమాచారం తెలుసుకోండి: