సౌందర్య మరణం ఇప్పటికీ అభిమానులను బాధ పెడితేనే ఉంటుంది. 31 ఏళ్ల అతి చిన్న వయసులో ఆమె మరణించడం చాలా బాధాకరం. అయితే సౌందర్య మరణం పై ఇప్పటికే ఎన్నో రూమర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి.ఇక సౌందర్య మరణించే సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అని కూడా కొన్ని రూమర్స్ వినిపించాయి. కానీ అందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు. అయితే తాజాగా సౌందర్య మరణం గురించి మరో షాకింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.అదేంటంటే..ఆ దోషం వల్లే సౌందర్య జీవితం బలయ్యింది అంటూ ఓ వార్త వినిపిస్తుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సౌందర్య రాజకీయ ప్రచారం కోసం వెళ్తున్న సమయంలో విమాన ప్రమాదం జరిగి అందులో ఉన్న చాలామంది మరణించారు. ఆ విమాన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నారు.

అలా ఇద్దరు మరణించడంతో సౌందర్య ఫ్యామిలీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే అలాంటి సౌందర్య మరణానికి కారణం ఆ దోషమే అంటూ ఓ వార్త వినిపిస్తోంది. అదేంటంటే..సౌందర్య ఇంట్లో వాళ్ళు కాదన్న సంబంధాన్ని చేసుకుంది.సౌందర్య వరసకు మామ అయ్యే రఘుని చాలా రోజుల నుండి ప్రేమించింది. అయితే ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పగా వాళ్ళు మొదట ఒప్పుకోలేదట. కానీ సౌందర్య మాత్రం పట్టుదలకు పోవడంతో చేసేదేమీ లేక ఇద్దరు జాతకాలు చూపించారట. అయితే సౌందర్య, రఘు జాతకం చూసిన ఆస్ట్రాలజర్ వీరిద్దరి జాతకాలు కలవలేదు..జాతకంలో దోషం ఉంది పెళ్లి చేసుకుంటే మంచి జరగదు అని చెప్పారట.

కానీ ఆయన చెప్పింది సౌందర్య వినలేదు.అలాంటి పిచ్చి పిచ్చి జ్యోతిష్యాలు నమ్మకూడదు అని తల్లిదండ్రులకు చెప్పి చివరికి తాను ప్రేమించిన రఘుని పెళ్లి చేసుకుంది.అయితే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి బంధం ఎన్ని రోజులో నిలువలేదు. పెళ్లయిన సంవత్సరంలోపే సౌందర్య మరణించింది. అయితే సౌందర్య మరణానికి కారణం ఆ దోషమేనని, ఆ దోషం కారణంగా సౌందర్య మరణించిందని, జాతకాలు కలవలేదంటే సౌందర్య విని పెళ్లి చేసుకోకపోయి ఉంటే బాగుండేదని,ఆ దోషమే సౌందర్య జీవితాన్ని బలితీసుకుంది అంటూ సౌందర్య మరణించినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: