విశాల్ అనారోగ్య సమస్య నుంచి త్వరగా కోలుకోవాలని తిరిగి సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకున్నారు. అయితే విశాల్ నటించిన మదగజరాజ సినిమా రిలీజ్ అవ్వగా ఈ సినిమా ప్రీమియర్స్ కి వచ్చిన విశాల్ మాత్రం చాలా హుషారుగా కనిపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఇందులో నా బలంతో నేను ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తానని ఫీవర్ నుంచి తను పూర్తిగా కోలుకున్నారని తెలియజేశారు తనకు ఇప్పుడు ఎలాంటి వణుకు పుట్టించే సమస్యలు లేవని మీరు చూపించే నాపైన ఈ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనట్టు తెలియజేశారు విశాల్.
కుష్బూ భర్త డైరెక్టర్ సుందర్ సి డైరెక్షన్ల విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రం మదగజరాజ. ఈ సినిమా 2012లో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇటీవలే ఈ సినిమా 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో ఒక్కసారిగా చిత్రబృంద ప్రమోషన్ చేయడానికి ఒక వేడుకను ఏర్పాటు చేయగా అక్కడికి విశాల్ కూడా రావడం జరిగింది. దీంతో అక్కడ తన అనారోగ్య సమస్యలకు వదంతులు పలు రకాల వార్తలు వినిపించాయి. మొత్తానికి విశాల్ మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో అభిమానులు ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతున్నాయి.