బాలయ్య అంటే చాలామంది జనాలు ఇష్టపడుతూ ఉంటారు . అది అందరికీ తెలుసు . సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన సినిమాలు బాగుంటాయి అని ..ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా బాలయ్య తన అభిమానులు పట్ల చూపించే ప్రేమ అందరికీ బాగా నచ్చేస్తూ ఉంటుంది . కాగా ఈ సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన "డాకు మహారాజ్" సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది . ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ "డాకు మహారాజ్" సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది .

దీనితో తెలుగు రాష్ట్రాల తో పాటు అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాలలో బాలయ్య అభిమానులు ఓ రేంజ్ లో బాలయ్యను ప్రశంసించేస్తున్నారు.  అమెరికా, ఆస్ట్రేలియాలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. మరి ముఖ్యంగా అమెరికాలో బాలయ్యకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు అన్న విషయం అందరికీ తెలుసు . అక్కడ తెలుగు రాష్ట్రాల కంటే కొద్ది గంటల ముందే మొదటి షో పూర్తి అయిపోయింది . దీంతో ఫ్యాన్స్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని సినిమా వేరే లెవెల్ లో ఉంది అంటూ ట్వీట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ని కూడా షేర్ చేసేసారు.

దీంతో సినిమా చూసిన బాలయ్య అభిమానులు అమెరికాలో  సందడి చేసిన తాలూకా పిక్చర్స్ వీడియోస్ వైరల్ గా మారాయి . కాగా "డాకు మహారాజ్" సినిమాతో బాలకృష్ణ వరుసగా నాలుగో హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . ఎప్పటిలాగే డైలాగులతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేసాడు అంటూ సినిమాకి హైప్ పెంచేస్తున్నారు . ఈ క్రమంలోనే "డాకు మహారాజ్" మొదటి షో పూర్తవగానే థియేటర్ నుంచి బయటకు వచ్చిన బాలయ్య - టిడిపి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్న ఒక వీడియో బాగా వైరల్ గా మారింది . అయితే అందరూ బాలయ్య కటౌట్ కి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. కానీ వీళ్లు మాత్రం బాలయ్య అంటే అభిమానం పిక్స్ కి చేరుకోవడంతో బాలయ్య కటౌట్ కి ఏకంగా మ్యాన్షన్ హౌస్ తో అభిషేకం చేస్తూ వీడియో తీశారు . ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . కొంతమంది ఇది బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే కొంతమంది ఇది ఎక్కడ అభిమానం రా బాబు మాన్షన్ మొత్తం వేస్ట్ అయిపోయిందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!




మరింత సమాచారం తెలుసుకోండి: