ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ, ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా నటించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా ఈరోజు (జనవరి 12 2025) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే యూఎస్ లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా గురించి జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా బాలయ్య మరొకసారి విశ్వరూపం చూపించాడని గాడ్ ఆఫ్ మాసేస్ కు పెట్టింది పేరు అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.  అలాగే ప్రగ్యా జైస్వాల్ కూడా మరొకసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈరోజు ప్రగ్యా జైస్వాల్ పుట్టినరోజు.. ఈరోజు ఆమె నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా విడుదలైంది. మొత్తానికి అయితే తన పుట్టినరోజు నాడు విడుదలైన ఈ సినిమా ఆమెకు బాగా కలిసి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.  దీనికి తోడు బాలకృష్ణ కు లక్కీ హీరోయిన్గా కూడా ఈమె మారిపోయిందని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే.. మోడల్గా కెరియర్ను ఆరంభించిన ఈమె ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కంచే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి,  ఇక తర్వాత నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ సినిమాలో కూడా నటించింది.

ఆ తర్వాత జయ జానకి నాయక,  నక్షత్రం, గుంటూరోడు, సైరా నరసింహారెడ్డి,  అఖండ , ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.  మరొకవైపు అఖండ 2 సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికైనా మిగతా హీరోల సినిమాలలో అవకాశాలు వస్తాయా లేక ఎప్పటిలాగే మారుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రగ్యా నటనను ఇప్పటికైనా దర్శకులు గుర్తించాలని అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: