ఇకపోతే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 18 సంవత్సరాలకు పైగానే అవుతుంది. ఇప్పటికీ కూడా అదే జోషులో వరుస సినిమాలు ప్రకటిస్తూ.. యంగ్ హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోయేలా భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈమె చేతిలో ఇప్పుడు 8 ప్రాజెక్టులు ఉన్నాయి. వచ్చే ఏడాది నాలుగు ప్రాజెక్ట్లు విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సినిమాల పరంగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా భారీ సక్సెస్ అందుకుంది నయనతార. ఈ నేపథ్యంలోనే ఈమె ఇంత సక్సెస్ అవ్వడానికి అసలు కారణం ఏంటని అభిమానుల సైతం ఆరాతీస్తున్నారు. మరి నయనతార సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. నయనతార గత ఏడాది..ఫెమి 9 శానిటరీ నాప్కిన్ అనే బిజినెస్ స్టార్ట్ చేసింది .ఇక వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేసిన ఈమె, ఇందులో కంపెనీ ఎదుగుదల కోసం సహాయపడిన వారికి బహుమతులు కూడా అందించింది. ఈ క్రమంలోనే తన సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఈ రెండు ఉంటే ఎవరైనా జీవితంలో సక్సెస్ సాధించవచ్చు అని, అందుకే తాను కూడా ఈ రెండు ఫాలో అవుతున్నాను కాబట్టే ఈ రేంజ్ లో ఉండడానికి కారణం అయ్యింది అంటూ తెలిపింది. మొత్తానికైతే నయనతార సక్సెస్ సీక్రెట్ తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు