టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. నందమూరి హీరోలు ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సాధిస్తూ సత్తా చాటుతున్నారు. దేవర, డాకు మహారాజ్ సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగకుండానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. క్రిటిక్స్ నుంచి, నెటిజన్ల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం గమనార్హం.
 
నందమూరి హీరోలకు పట్టిందల్లా బంగారం అవుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డాకు మహారాజ్ కలెక్షన్ల విషయంలో సైతం అద్భుతాలు చేస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. బాలయ్య, ఎన్టీఆర్ కాంబోను చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబో సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.
 
బాలయ్య గత కొన్నేళ్లుగా భిన్నమైన సినిమాలకు ఓటు వేస్తూనే ఆ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే విషయంలో సఫలమవుతున్నారు. బాలయ్య తర్వాత మూవీ అఖండ సీక్వెల్ పై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస విజయాలు సైతం బాలయ్య కెరీర్ గ్రాఫ్ ను అంతకంతకూ పెంచుతున్నాయి.
 
డాకు మహారాజ్ సినిమాకు బాలయ్య 34 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకున్నారని సమాచారం అందుతోంది. తాను తీసుకున్న రెమ్యునరేషన్ కు బాలయ్య న్యాయం చేసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య ఈ సినిమాతో ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతారేమో చూడాలి. డాకు మహారాజ్ సినిమా ఇతర భాషల్లో సైతం కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. డాకు మహారాజ్ మూవీ టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: