రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం నటించిన సోలో మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలిసి అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను శంకర్ అద్భుతంగా తీర్చిదిద్దారు.


శంకర్ గతంలో చేసిన సినిమాలు ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడంతో ఈసారి శంకర్ చాలా జాగ్రత్త వహించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్జె సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలను పోషించారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.


అయితే ఎన్నో అంచనాల నడుమ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జనవరి 10న గ్రాండ్ గా విడుదల అయింది. విడుదలైన మొదటి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొదటిరోజు మంచి ఓపెనింగ్ అందుకొని సక్సెస్ఫుల్ గా గేమ్ చేంజెస్ సినిమా రన్ అవుతోంది.


కాగా, ఈ సినిమాలో "నానా హైరానా" పాటను యాడ్ చేసినట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. నేటి నుంచి ఈ పాట థియేటర్లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మొదట 14వ తేదీన సాంగ్ యాడ్ చేస్తామని తెలపగా రెండు రోజుల ముందే ఈ పాట వచ్చేసింది. పాట లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో మేకర్స్ ఈ పాటను యాడ్ చేశారు. ఈ పాట యాడ్ చేశారని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: