ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ వరుస సినిమాలతో.. ఏడు పదుల వయసు దాటినా కూడా అంతే పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా సౌత్ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో జైలర్ 2 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లాక్ బస్టర్ అందుకున్న జైలర్ కి సీక్వెల్ గా రాబోతుండడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఎలాంటి అప్డేట్ విడుదల కాకపోవడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ నేపథ్యంలోనే అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ సంక్రాంతికి జైలర్ -2 నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకవేళ ఇదే నిజమైతే అసలైన సంక్రాంతి పండుగ ప్రారంభం అంటూ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక రజనీకాంత్ విషయానికి వస్తే..  ఎక్కడో కర్ణాటకలో కండక్టర్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈయన ఆ తర్వాత నాటక రంగంలోకి అడుగుపెట్టి,  ఇప్పుడు సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ చిత్రాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు రజినీకాంత్. మరి రజనీకాంత్ జైలర్ 2 సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం రజనీకాంత్ వేలకోట్ల ఆస్తికి అధిపతి అయినా సరే సింపుల్గా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఏదేమైనా రజినీకాంత్ జైలర్ 2 సక్సెస్ సాధించాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: