నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. బాలకృష్ణ ఎప్పటిలాగే తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ అప్పీల్ తో నానాజీగా సీతారాంగా తన పాత్రల్లో నటించారు. సరికొత్త గెటప్, దానికి తగినట్టుగా మేనరిజంతో అభిమానులను కేక పెట్టించే ప్రయత్నాన్ని చేశారు నందమూరి బాలకృష్ణ. ఇక ఈ సినిమాలో నందినిగా శ్రద్ధ శ్రీనాథ్ ఓ పవర్ఫుల్ పాత్రలో మరోసారి తన మార్కును చూపించారు.


కథలో కీలకంగా స్టోరీని ముందుకు నడిపించే పాత్రతో తనదైన శైలిలో నటించి సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ప్రగ్యా జైస్వాల్ మరో కీలకమైన పాత్రలో మెరిశారు. ఎస్ఐగా ఊర్వశీ రౌతేలా నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగాను అందాలను ఆరబోసింది. బాబి డియోల్ తన విలనిజాన్ని అద్భుతంగా చూపించారు. బాబీ డియోల్ బాలకృష్ణతో పోటీపడి మరీ నటించారు.


మరో విలన్ గా రవికిషన్ నానాజీగా నువ్వా నేనా అనే విధంగా నటించారు. సంగీతం అద్భుతంగా ఉంది. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. కథలో కొత్తదనం లేకుండా రొటీన్ గా ముందుకు సాగింది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న ఉంది. డాకు మహారాజ్ సినిమా ఒకపక్క మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఉంది. బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.


కానీ బాలకృష్ణ సినిమాలో కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చునే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా ఈరోజు ఎనిమిది గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. కాగా, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని, పక్కా సూపర్ హిట్ అవుతుందని కొంతమంది అభిమానులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి  రేంజ్ మాస్ బ్లాక్స్ కు సూపర్ స్టైలిష్ ఫ్రేమ్స్  కలిస్తే అది ఒక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గా సినిమా ఉందని అంటున్నారు. బోయపాటి తరహాలోనే బాలయ్యకు మంచి హిట్‌ ఇచ్చాడని బాబీని పొగుడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: