- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మాస్ యాక్షన్ కథలని కొత్తగా చూపించడం మ‌న తెలుగు దర్శకులకు పెద్ద ఛాలెంజ్ .. ఎందుకంటే కొన్ని వంద‌ల క‌థ లు ఈ జాన‌ర్ లో వ‌చ్చేశాయి. కొన్నేళ్లుగా .. అందులోనూ గ‌త 20 ఏళ్లు గా ఈ త‌ర‌హా క‌థ‌ల‌ను మ‌న తెలుగు ప్రేక్ష‌కులు చూసి చూసి ఉన్నారు. అందులోనూ అలాంటి మాస్ .. యాక్ష‌న్ క‌థ‌లో మాస్ ఆఫ్ గాడ్ అయిన బాల‌య్య‌తో చేయ‌డం అంటే ... బాలయ్యతో యాక్షన్ సినిమా అంటే అది మరింత టఫ్ ఎలాంటి గొప్ప ద‌ర్శ‌కుడికి అయినా.. ! ఎందుకంటే ఆయన ఇప్పటికే బోలెడు యాక్షన్ కథలు చేసేసి.. ప్రేక్ష‌కులు చూసేసి ఉన్నారు. అయితే దర్శకుడు బాబీ ఇక్కడే చాలా తెలివిగా అలోచించాడ‌ని చెప్పాలి.


న‌ట‌సింహం బాలయ్యకు పర్ఫెక్ట్ గా సూట‌య్యే ఓ ఫ్యాక్షన్ కథని తీసుకున్నాడు. అయితే దీనికి చంబల్ బ్యాక్ డ్రాప్ జోడించాడు. ఈ రెండు సెట‌ప్ ల‌తో  డాకు మహారాజ్ సినిమాకు  కొత్త కలర్ సెట్ అయ్యింది. బ్యాక్ డ్రాప్ మాత్రమే కాదు ఇందులో టోటల్ యాక్షన్ చూస్తుంటే ఓ స‌గ‌టు తెలుగు సినిమా .. అందులోనూ మాస్ సినిమా క‌మ‌ర్షియ‌ల్ సినిమా కు భిన్నంగా హాలీవుడ్ యాక్ష‌న్ సీన్లు గుర్తుకు వ‌చ్చేలా డిజైన్ చేశారు.


ఈ యాక్ష‌న్ తెర‌పై కి సూప‌ర్బ్ అనేలా వ‌చ్చింది. మామూలుగా చెడు విల‌న్ పై పోరాటం చేసే హీరో అనే రెగ్యుల‌ర్ టెంప్లెట్ లో సినిమా ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే తో పాటు యాక్ష‌న్ లో చూపించిన కొత్త‌ద‌నం ఈ రోజు డాకూ మ‌హారాజ్ ను ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా చేసింది. ఇక డాకు మహారాజ్ కథ ఎత్తుగడే భిన్నంగా ఉంటుంది .. అడవిలో సెట్ చేసిన ఓ భారీ ఇంటర్వెల్ బ్యాంగ్ ని సినిమాకు ఫ‌స్ట్ షాట్ గా వ‌స్తుంది. అలా చాలా డిఫ‌రెంట్ టేకింగ్ తో బాబి సినిమాను న‌డిపించాడు. ఇది బాబి మార్క్ ట్విస్ట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: