- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


నంద‌మూరి న‌ట‌సింహం .. గాడ్ ఆఫ్ మాసెస్ బాల‌కృష్ణ న‌టించిన డాకూ మ‌హారాజ్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమా పై ముందు నుంచి ఉన్న భారీ అంచ‌నాల‌ను నిజం చేస్తూ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ఫ‌స్టాఫ్ .. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింద‌నే అంద‌రూ చెపుతున్నారు. అయితే సెకండాఫ్ లో డ్రామా కాస్త ఎక్కువై .. సినిమా ల్యాగ్ అయ్యింద‌నే అంటున్నారు. ఇక ఇంట‌ర్వెల్ సీన్ నే సినిమా తొలి సన్నివేశంలోనే చూపిస్తూ కథని మొదలుపెడతారు. కృష్ణమూర్తి కుటుంబం, పాప, ఎమ్మెల్యే త్రిమూర్తులు, అతడి తమ్ముడు.. ఈ పాత్రల చుట్టూ బిగినింగ్ లో నడిపిన సన్నివేశాలు కాస్త స్లో అయిన ఫీలింగ్ క‌లుగుతుంది.


ఎప్పుడు అయితే నానాజీగా బాలయ్య ఎంట్రీ తర్వాత అక్క‌డ నుంచి కథ లో వేగం పుంజుకుంటుంది. తొలి సగంలో పాప ఎమోషన్ ని ఎస్టాబ్లెస్ చేయడానికి ద‌ర్శ‌కుడు బాబి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న‌ట్టు అనిపిస్తుంది. మరోవైపు స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్ రాజ్ (షైన్ టామ్ చాకో) డాకు మ‌హారాజ్ పాత్ర‌ గురించి చేసే అన్వేషణ ఆ పాత్ర పై ఆసక్తిని పెంచేలా వుంటుంది. ఓ ఫైట్ సీక్వెన్స్ తర్వాత వచ్చే డబిడి దిబిడి సాంగ్ వన్స్ మోర్ అనేలా బాగా కుదిరింది. ఎవ‌డైనా చ‌ద‌వ‌డం లో మాస్ట‌ర్స్ చేస్తాడేమో ... నేను చంప‌డంలో చేశా అనే డైలాగ్ సినిమా కే హైలెట్‌.


ఇక ద‌బిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయిన‌ప్పుడు నెగ‌టివ్ కామెంట్లు ఎక్కువుగా వ‌చ్చాయి. అయితే ఈ సాంగ్ తెర‌మీద చూస్తున్న‌ప్పుడు మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇక డాకూ మ‌హారాజ్ సినిమాకి మొదటి నుంచి హైలెట్ గా చెప్పుకుంటూ వస్తున్న ఇంటర్వెల్ బ్లాక్ అయితే నిజంగానే అదిరింది. ఓ ఇరవై నిముషాలు పాటు సాగే ఆ సీక్వెన్స్ థియేటర్లో మామూలుగా ఎంజాయ్ చేయం. అస‌లు ఈ సినిమాకు ఇంట‌ర్వెల్ అయితో ఊగి పోతాం.

మరింత సమాచారం తెలుసుకోండి: