- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన డాకూ మ‌హారాజ్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమా క‌థ రొటీన్ గానే ఉన్నా ద‌ర్శ‌కుడు బాబి ఇచ్చిన ఎలివేష‌న్లు .. థియేట‌ర్ల లో సినిమా చూస్తున్న‌ప్పుడు జ‌నాలు మాస్ తాండ‌వం తో ఊగిపోతున్నారు. బాలయ్య సినిమా అనగానే తమన్ కి పూనకాలు వచ్చేస్తాయి .. ఆ పూన‌కం మామూలుగా ఉండ‌దు. డాకులో కూడా చాలా చోట్ల పూనకాలు తెప్పించే బీజీఎం ఉంది.. అస‌లు ఒక్కోసారి ఆ బీజీఎం వింటుంటే .. బాల‌య్య న‌ట‌న తో పాటు సినిమాలో సీన్ల‌ను ఎలివేట్ చేస్తూ.. ఇంకా చెప్పాలి అంటే వాటిని డామినేట్ చేసేలా ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో తమన్ బీజీఎం బాక్సులు అదిరిపోయేలా ఇచ్చాడు. ఈ విష‌యంలో థ‌మ‌న్ బాక్సులు ప‌గిలిపోతే త‌న‌కు సంబంధం ఉండ‌ద‌ని ఎలా చెప్పాడో అదే మాట ను 200 % తో నిల‌బెట్టుకున్నాడు.


సినిమా లో బాల‌య్య ఎంట్రీ నుంచి.. డాకూ మ‌హారాజ్ పాత్ర ను అల్లుకున్న విధానం.. బాల‌య్య పాత్ర‌కు ఇచ్చిన ఎలివేష‌న్లు.. యాక్ష‌న్ సీక్వెన్స్ లు .. బాల‌య్య‌ను చాలా స్టైలీష్ గా చూపించిన తీరుకు కేవ‌లం బాల‌య్య అభిమానులు మాత్ర‌మే కాదు.. మాస్ జ‌నాల‌కు మంచి విజువ‌ల్ ఫీస్ట్ గా నిలిచాయి. డబిడి దిబిడి సాంగ్ మాస్ కి నచ్చేలానే వుంటుంది. అలాగే .. . డీఓపీ విజయ్ కన్నన్ విజువల్స్ చాలా అంటే చాలా రిచ్ గా వున్నాయి. ఎడారిలో తీసిన సన్నివేశాలు సినిమా చూస్తోన్న ప్రేక్ష‌కుడికి కొత్త అనుభూతిని ఇస్తాయి. యాక్షన్ ని ఆయన కెమెరా చాలా స్టయిలీష్ గా చూపించేలా చేసింది.


ఇక ఎవ‌రైనా చ‌ద‌వ‌డంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంప‌డంలో చేశా .. వార్నింగ్ చచ్చే వాడు కాదు చంపేవాడు ఇవ్వాలి .. సింహం నక్కల మీదకి వస్తే వార్ అవ్వదురా .. ఇట్స్ కాల్డ్ హంటింగ్’ ఈ డైలాగ్స్ ప్లేస్మెంట్ చ‌క్క‌గా సెట్ అయ్యింది. ట్రోల్స్ లో ఎక్కువ‌గా వినిపించే ‘ అది చెప్పు..ముందు ’ ఈ సినిమాలో క‌రెక్ట్ ప్లేస్ మెంట్ లో వాడుకోవ‌డం సూప‌ర్బ్‌. స్టంట్స్ అయితే చాలా కొత్త‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌ను ఇంకా బాగా బెట‌ర్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. సితార నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. బాలయ్య బలం మాస్ + యాక్షన్. దీన్ని దర్శకుడు బాబీ ఇదివరకెన్నడూ చూడని స్టయిలీష్ కోణంలో చూపించి స‌క్సెస్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: