ఈ సినిమా ఈ రోజు ఎనిమిది గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది డాకు మహారాజ్. నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. కాగా, ఇవాళ విడుదలైన డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి ప్రముఖ సిని విమర్శకుడు ఉమైర్ సందు మొదటిగా రివ్యూ ఇచ్చారు.
వాస్తవానికి ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి దబిడి దిబిడి పాట చూసిన అనంతరం కుటుంబ ప్రేక్షకులు థియేటర్ కు రారేమో అనే సందేహాలు చాలామందిలో వచ్చాయి. అయితే ఈ పాట సూపర్ హిట్ అయింది. ఉమైర్ సందు ఇచ్చిన రివ్యూ ప్రకారం మాస్ ఆడియన్స్ కు ఈ పాట అద్భుతంగా నచ్చుతుందని అలాగే ఈ సినిమాను దర్శకుడు బాబి అద్భుతంగా రూపొందించారని వెల్లడించాడు.
యాక్షన్ ఒక రేంజ్ లో అద్భుతంగా ఉందని, ఎమోషన్స్, ఫన్నీ, డ్రామా ఇలా అన్నింటిని బాబి సమపాళ్లలో నింపాడని చెప్పాడు. నందమూరి నటసింహం బాలకృష్ణ బాబీ డియోల్ కలిసి పైసా వసూల్ సినిమాను చేశారని పక్కా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. వీరిద్దని నటన సినిమాకు మంచి ఆయువుపట్టుగా మారిందని ఉమైర్ సందు సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.