కేవలం కొద్దిగంటలే.. మరికొద్ది గంటల్లోనే వెంకటేష్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి అంతా సిద్ధమైపోయింది . కాగా సినిమా ప్రమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు హీరో వెంకటేష్ . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ .. అదేవిధంగా మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపిస్తూ ఉండడం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో ఫ్యాన్స్  ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు.


ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా "సంక్రాంతికి వస్తున్నాం" అంటూ కూడా రిజల్ట్ ని ముందే అంచనా వేసేస్తున్నారు. కాగా మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అనగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగెస్ట్ హీరో కూడా కనిపించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు హైలైట్ గా మారింది. . సినిమా ప్రమోషన్స్ కి ఇది బాగా తోడ్పడింది . ఆ హీరో మరెవరో కాదు "సిద్దు జొన్నలగడ్డ".



డిజె టిల్లు సినిమాతో సెన్సేషన్ హీరోగా మారిపోయిన సిద్దు జొన్నలగడ్డ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట.  చాలా కొద్ది టైం స్క్రీన్ పై కనిపించబోతున్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది అని ..ఆయన కనిపించే ఐదు పది నిమిషాలు థియేటర్లో నవ్వులే నవ్వులు పూయిస్తాడు అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. .  సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే వార్త హాట్ హాట్ గా త్రెండ్ అవుతుంది. దీంతో ఎప్పుడెప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్ అవుతుందా..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: