రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజున ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుతం థియేటర్లో మంచి కలెక్షలను సొంతం చేసుకుంటుంది. నార్త్ లో గేమ్ చేంజర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి సెలవులు ఉండడంతో సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు.


మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమాలకు పైరసీ ఎఫెక్ట్ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. పెద్ద సినిమాలకు అయితే ఈ పైరసీ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తదుపరి రోజునే గేమ్ చేంజర్ సినిమా HD ప్రింట్ ని పైరసీ చేశారు. అంతేకాకుండా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఆంధ్ర బస్సు ఆంధ్రకి వెళ్లే బస్సులలో గేమ్ చేంజర్ సినిమా పైరసీ ప్రింట్ వేశారు.


దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో రామ్ చరణ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా హైకోర్టు సూచనల మేరకు గేమ్ చేంజర్ సినిమా కోసం ఇచ్చిన అదనపు సోలా వెసులుబాటును ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో తెల్లవారుజామున ప్రదర్శించే స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రభుత్వం చెప్పింది.


ఇదిలా ఉండగా... గడిచిన 24 గంటల్లో 3,16,000+ టికెట్లు బుక్ అయ్యాయి. గేమ్ చేంజర్ సినిమాకు మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చిన రెండో రోజు నుంచి రామ్ చరణ్ నటించిన ఈ సినిమా మంచి పికప్ అందుకుని మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. మరోవైపు సంక్రాంతి కావడంతో ఈ సినిమాకు అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. సంక్రాంతి సెలవులు కావడంతో గేమ్ చేంజర్ సినిమాను చూడడానికి అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: