ముఖ్యంగా టికెట్ల విషయంలో కూడా డాకు మహారాజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో కూడా దుమ్ము లేపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనంతపురంలో ఉండే శాంతి థియేటర్, ఎస్వి, UV 2 , గంగ ,సుధా, గాయత్రి వంటి థియేటర్లలో టికెట్లు ఫుల్లుగా బుక్ అయిపోయాయట..UV -3 థియేటర్లో మాత్రం 70% వరకు టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ కింద మిగిలి ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బాలయ్య అభిమానులు ఫ్రీ రిలీజ్ ఈవెంట్తో చేస్తామనుకున్న హంగామాని థియేటర్లో ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఈరోజు ఉదయం షో పడినప్పటి నుంచి డాకు మహారాజ్ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ఈ సినిమాలో బాలయ్య నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ రావడంతో బాలయ్య సినిమా గేమ్ ఛేంజర్ సినిమా పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నట్టు కనిపిస్తోంది.. మరి ఏ మేరకు డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య తన కెరీర్ లోనే అత్యధికంగా ఫస్ట్ డే కలెక్షన్స్ తో రికార్డు సృష్టిస్తారో చూడాలి మరి. ఇందులో బాబీ డియోల్ విలన్ గా నటించగా.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. మరి ఏ మేరకు సంక్రాంతి విన్నర్ ఎవరని తెలియాలి అంటే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయ్యే వరకు చెప్పడం కష్టం.