ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన బాలకృష్ణ డాకు మహారాj మూవీ మొదటి షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ టాక్ తో థియేటర్ లో ముందుకు పోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో చాలామంది నందమూరి ఫ్యాన్స్ ట్రైలర్ బాలేదు అని అన్నారు.కానీ సెకండ్ ట్రైలర్ విడుదలైన సమయంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక సినిమా విడుదలయ్యాక ఆ అంచనాలు అందుకుంది. ఈ సినిమా మంచి పైసా వసూల్ మూవీ అని రొటీన్ స్టోరీ అయినప్పటికీ డైరెక్టర్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా బాగున్నాయని, మ్యూజిక్ ఆకట్టుకుందని,సినిమా చూసే నందమూరి ఫ్యాన్ కి గూస్ బంప్స్ వచ్చాయి అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ చిన్న రోల్ లో మెరిసిన ఊర్వశి రౌటేలా డైరెక్టర్ కి లవ్ లెటర్ రాసింది.. 

ఇక ఆయన ఎవరో కాదు బాబి.. బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలాకి సౌత్ లో గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ అంటే అందరికీ బాబీనే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈయన దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య అలాగే డాకు మహారాజ్ రెండు సినిమాల్లో ఊర్వశి రౌటేలకి ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ ఐటెం సాంగ్స్ తో ఊర్వశి రౌటేల పేరు సౌత్ లో మోగిపోతుంది. ఒకరకంగా సౌత్ లో ఈమెకు గుర్తింపు రావడానికి ప్రధాన కారణం బాబీ అయ్యారు. అలా బాలీవుడ్ లో నటించినా రాని గుర్తింపు వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ సినిమాల ద్వారా ఊర్వశి రౌటేలకు వచ్చింది.

అయితే ఇండస్ట్రీలో తనని పాపులర్ చేసిన డైరెక్టర్ కి కృతజ్ఞతా భావంతో,ప్రేమతో ఊర్వశి రౌటేలా డైరెక్టర్ బాబీకి లెటర్ రాసింది.తనను నమ్మి తనకి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాబీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇక చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ కి మాత్రమే పరిమితం చేసిన బాబీ డాకు మహారాజ్ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో ఓ చిన్న ఫైటింగ్ సన్నివేశం  కూడా ఊర్వశితో చేయించారు డైరెక్టర్. అలా ఊర్వశికి అంత మంచి గుర్తింపు ఇచ్చిన డైరెక్టర్ కి ఊర్వశి కృతజ్ఞతా భావంతో లెటర్ రాసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: