డాకు మహారాజ్ మూవీ ఈరోజు రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ సినిమా ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్ లో ప్రదర్శితమవుతుండగా బెనిఫిట్ షో సమయంలో స్పీకర్ పగిలిందని సమాచారం అందుతోంది. థమన్ స్పీకర్లు పగిలితే నాకు సంబంధం లేదని ప్రమోషన్స్ లో భాగంగా చెబుతుండగా థమన్ చెప్పిందే నిజమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
డాకు మహారాజ్ సినిమా వల్ల రాబోయే రోజుల్లో ఇంకెన్ని స్పీకర్లు పగులుతాయో అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థమన్ డాకు మహారాజ్ సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య తర్వాత సినిమాలకు సైతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య థమన్ కాంబో క్రేజీ కాంబో అనే సంగతి తెలిసిందే.
 
బాలయ్య తనకు తండ్రి లాంటి వ్యక్తి అని థమన్ తాజాగా వెల్లడించడం గమనార్హం. డాకు మహారాజ్ సినిమాకు అటు క్రిటిక్స్ నుంచి ఇటు యూట్యూబర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం. డాకు మహారాజ్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయి. కొంతమందికి ఫస్టాఫ్ నచ్చితే మరి కొందరికి సెకండాఫ్ నచ్చింది. సెకండాఫ్ రొటీన్ గా ఉన్నా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.
 
బాలయ్య సినిమాలో కనిపించిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. కొన్ని సీన్లు ఊహించేలా ఉండటం ఈ సినిమాకు ఒకింత మైనస్ అని చెప్పవచ్చు. బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య తన సినిమాలకు సంబంధించి లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. సంక్రాంతి సినిమాలలో కలెక్షన్ల విషయంలో డాకు మహారాజ్ ఇతర సినిమాలకు గట్టి పోటీ ఇస్తోంది.
 
డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్ల గురించి మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి. ఈ సినిమా బెనిఫిట్ షోల టికెట్లు 500 రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయి. తెల్లవారుజామున షోలు వేయడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: