ఈ సినిమాలో దబిడి దిబిడే పాటను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు రారేమో అని కొంతమంది కంగారుపడ్డారు. కానీ ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కొనసాగింది. ఇక వాటికి తగినట్టుగానే తన పాత్రలో బాలయ్య డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
డాకు మహారాజ్ సినిమాతో తెలుగు తెరకు నేరుగా పరిచయమైన బాబి డియోల్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాలను బాబి డియోల్ నటన అద్భుతంగా ఉంది. శ్రద్ధ శ్రీనాథ్ తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె పాత్రలోని డెప్త్ అందరిని ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా అద్భుతంగా నటించింది. ఆమె నటన చాలా బాగుంది.
అయితే ఈ సినిమా చూసిన అనంతరం హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. డాకు మహారాజ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని శ్రద్ధ శ్రీనాథ్ అన్నారు. సినిమా చూసి గూస్ బంప్స్ వచ్చాయని శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు. బాలయ్య ఫ్యాన్స్ కు స్పెషల్ గా హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ థాంక్స్ చెప్పారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.