నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. 2023 దసరా పండుగ సందర్భంగా విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే తాజాగా బాలయ్య హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ కి ఇప్పటికే అద్భుతమైన పాజిటివ్ టాక్ జనాల నుండి వస్తుంది.

ఇక ఈ మూవీ భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ఓ రికార్డును క్రాస్ చేసింది. ఆ రికార్డు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. భగవంత్ కేసరి సినిమా విడుదల అయిన మొదటి రోజు కంప్లీట్ అయ్యే సరికి బుక్ మై షో లో 150 3.4 కె టికెట్స్ సేల్ అయ్యాయి. ఇక డాకు మహారాజ్ సినిమాకు ఒక రోజు బుకింగ్స్ మొత్తం కంప్లీట్ కాకముందే 160 కే టికెట్స్ సెల్ అయ్యాయి. అలా బాలయ్య భగవంత్ కేసరి సినిమా రికార్డును డాకు మహారాజ్ మూవీ క్రాస్ చేసింది. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో బాలయ్య రెండు పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ కి తమన్ సూపర్ సాలిడ్ మ్యూజిక్ ను అందించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: