తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో విశాల్ ఒకరు. ఈయన అనేక తమిళ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం ఈయన పందెం కోడి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో విడుదల చేయగా ఈ సినిమా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా సూపర్ హిట్ కావడంతో ఈయనకు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈయన ఆ తర్వాత నుండి విశాల్ తను నటించిన చాలా సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగులో క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇకపోతే 2012 వ సంవత్సరం విశాల్ హీరోగా మగధ గజ రాజా అనే సినిమా అనౌన్స్ అయ్యింది.

ఇక ఈ సినిమా యొక్క షూటింగ్ 2013 వ సంవత్సరం కంప్లీట్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా చాలా సంవత్సరాలు విడుదల కాలేదు. ఈ మూవీ ని దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం అనగా 2025 పోంగల్ సందర్భంగా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ అనూహ్యంగా తమిళ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సంవత్సరం కోలీవుడ్ పొంగల్ విన్నర్ గా ఈ సినిమానే నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా పూర్తి అయిన తర్వాత 12 సంవత్సరాలకు విడుదల అయినా కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతూ కోలీవుడ్ పొంగల్ విజేతగా కోలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: