- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఒకరైన నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ - శ్ర‌ద్ధ శ్రీథాన్ - ఊర్వ‌శీ రౌతేలా హీరోయిన్లు గా యువ దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రమే “ డాకు మహారాజ్ ”. 2023 చివ‌ర్లో ద‌స‌రాకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి సినిమా త‌ర్వాత బాల‌య్య చేసిన సినిమా డాకూ మ‌హారాజ్‌. అటు వాల్తేరు వీర‌య్య సినిమా త‌ర్వాత బాబి డైరెక్ట్ చేసిన సినిమా ఇదే కావ‌డం విశేషం. చాలా అంటే చాలా భారీ అంచనాల‌తో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమాకు తొలి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చేసింది. సినిమా కు ఉద‌యం హిట్ టాక్ తో స్టార్ట్ అయ్యి సాయంత్రాని కి సూప‌ర్ హిట్ టాక్ దిశ‌గా దూసుకు పోతోంది.


ఈ సినియా యూనిట్ అంద‌రూ కూడా సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో మంచి ఉత్సాహంతో .. మంచి జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విషయంలో ఇంట్రస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో బయటకి వచ్చింది . ఈ అప్ డేట్ అదిరిపోయే అప్‌డేట్ అని చెప్పాలి. థియేటర్స్ లో ఈ సినిమా కి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ని ఉన్నట్టుగా అయితే చూపలేదు .. కానీ లేటెస్ట్ గా దీనిపై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు మీడియా వ‌ర్గా ల‌తో పాటు .. సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో ఈ సినిమా కి ప్రీక్వెల్ సినిమా చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సినిమాలో కీలక పాయింట్ పై ఈ ప్రీక్వెల్ ని చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. ఇది ఫ్యాన్స్ కు మంచి జోష్ నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: