పోయిన సంవత్సరం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కి మొదటి రోజు నార్త్ ఇండియాలో పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ కి మొదటి రోజు నార్త్ ఇండియాలో 7.95 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.

ఇకపోతే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ పెద్ద స్థాయిలో హిందీ ఏరియాలో కలక్షన్లను వసూలు చేయదు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ మొదటి రోజు దేవర పార్ట్ 1 కలెక్షన్లను మించి వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు గేమ్ చెంజర్ మూవీ కి నార్త్ ఇండియాలో 8.64 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.

ఇలా మొదటి రోజు నార్త్ ఇండియాలో దేవర పార్ట్ 1 మూవీ ని ఈజీగా బీట్ చేసిన గేమ్ చేంజర్ రెండవ రోజు మాత్రం దేవర పార్ట్ 1 కలెక్షన్ లను మాత్రం బీట్ చేయలేకపోయింది. రెండవ రోజు నార్త్ ఇండియాలో దేవర పార్ట్ 1 మూవీ కి 9.50 కోట్ల మేర నెట్ కలెక్షన్లు రాగా , గేమ్ చేంజర్ కి 8.43 కోట్ల మేర నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇలా మొదటి రోజు హిందీ ఏరియాలో దేవర పార్టీ 1 కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టిన గేమ్ చేంజర్ రెండవ రోజు మాత్రం దేవర పార్ట్ 1 కలెక్షన్లను బీట్ చేయలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: