తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో ఎక్కువ శాతం మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం బాబి ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను నా కథతో రూపొందించిన సినిమాలు అన్ని అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

నేను వేరే వాళ్ళ కథతో తేరకెక్కించిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నేను నా కథతో పవర్ , జై లవకుశ సినిమాలను రూపొందించాను. ఆ సినిమాలు మంచి విజయాలను సాధించాయి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్టేరు వీరయ్య అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కి బాబి సొంతగా కథ రాసుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా బాబి , బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.

మూవీ కి కూడా ఈయన సొంతగా కథను రాసుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి షో కే ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈయన చెప్పిన విధం గానే తాను రాసుకున్న కథలతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాడు అని అభిప్రాయాలను జనాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: