ఇక ఇందులో భాగంగానే డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు నిర్మాత నాగ వంశీ . డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయినా అనంతపురంలోనే సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తామని నిర్మాత నాగ వంశీ తెలియజేశారు . త్వరలోనే వేడుక ఉండు అన్నారు . ఆదివారం విడుదలైన ఈ మూవీకి మంచి ప్రేక్షకు ఆదరణ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ఈ విషయాలు చెప్పుకు వచ్చారు . ఈ ప్రెస్ మీట్ లో నాగవంశీ తో పాటు దర్శకుడు బాబి మరియు హీరోయిన్లు ప్రజ్ఞ జైష్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ , ఊర్వశి రౌతేలా పలు విషయాలు పంచుకున్నారు .
కాగా డాకు మహారాజ్ చిత్రం రిలీజ్ కు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను అనంతపురంలో నిర్వహించాలని చిత్ర బృందం భావించింది . కానీ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన టీం తమ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకుంది . అందుకే తమ సక్సెస్ ఈవెంట్ ను మాత్రం అనంతపురంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పుకు వచ్చారు నిర్మాత నాగ వంశీ . మరి ఏం జరగనుందో చూడాలి . డాకు మహారాజ్ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైన రికార్డులను సృష్టిస్తుందో అని నందమూరి అభిమానులు వేచి చూస్తున్నారు .