అయితే ఇప్పుడు తాజాగా లావణ్య మరొకసారి తన సెకండ్ ఇన్నింగ్స్ తో వస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడంతో ఈ విషయం మరొకసారి వైరల్ గా మారింది. ఈసారి మస్తాన్ సాయి కి ముడి పడిందంటూ అతని వ్యవహారాలను కూడా బయట పెడతానని తెలియజేసింది లావణ్య.. అలాగే లైంగిక వేధింపులు డ్రగ్స్ వ్యవహారాన్ని కూడా తెలియజేస్తానని తెలిపింది సోమవారం ఉదయానికి మస్తాన్ సాయి మొదటి వీడియోతో తన పని మొదలు పెడతానని వెల్లడించింది లావణ్య. దీన్నిబట్టి చూస్తే రాజ్ తరుణ్ కి మళ్ళీ తిప్పలు తప్పేలా లేదు..
రాజ్ తరుణ్ తరుణ్ వివాహం చేసుకున్నాడని గర్భవతిని చేసి తీయించుకోవాలని చాలా ఒత్తిడి చేశారని ఆమె గతంలో కూడా ఆరోపణలు చేసింది. ఇలా తనని మోసం చేసి ఇప్పుడు హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కొత్తగా డేటింగ్ మొదలు పెట్టారంటూ పలు రకాల సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య ప్రేమాయణం నడిపిందని మస్తాన్ సాయిని మోసం చేసిందని రాజ్ తరుణ్ కూడా ఆరోపించారు. ఆ సమయంలో లావణ్యతో పాటుగా మస్తాన్ కూడా పలు మీడియాలలో పాల్గొనడం జరిగింది. ఇలా ఎంతో రచ్చ రచ్చ జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు రెండో పార్ట్ ని కూడా సిద్ధం చేయబోతున్నట్లు లావణ్య వెల్లడించింది.