తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాతయిన త్రినాధరావు నక్కిన గురించి పరిచయం అవసరం లేదు. ఈయన సినిమా చూపిస్త మామ, నేను లోకల్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. త్రినాధరావుకు చిన్ననాటి నుండి కథను ఆసక్తిగా చెప్పగలిగే ఒక కళ ఉంది. ఆయన ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్ళాడు. సినిమా దర్శకుడిగా మారడానికి ముందు ఈయన ఈటీవీ కోసం కొన్ని సీరియల్స్ కూడా చేశాడు. త్రినాధరావు, 2012లో మేం వయసుకు వచ్చాం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు, మరికొన్ని సినిమాలకు రచయితగా ఈయన పనిచేశాడు.
తాజాగా ఈయన స్టార్ హీరోయిన్ అన్షు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన్మధుడు మూవీలో హీరోయిన్ గా నటించిన ఈ  భామకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈమె తన అందం, అభినేయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈమె చాలా కాలంగా టాలీవుడ్ సినిమాల్లో కనిపించలేదు. ఇటీవల ఈమె మజాకా సినిమాలో మళ్లీ కనిపించనుంది. 
సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కు సంబంధించిన టీర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత హీరోయిన్ అన్షు మళ్లీ నటిస్తున్నారని తెలిపారు. ఆమె కొంచెం సన్నబడిందని అన్నారు. అందుకే తిని పెంచమ్మా అని ఆయన తెలిపారు. తెలుగుకు ఇది సరిపోదని ఆయన అన్నారు. అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని త్రినాధ రావు చెప్పుకొచ్చారు. ఆ మాటలకి హీరోయిన్ అన్షు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్లను నోటికొచ్చినట్లు మాట్లాడటమేంటని డైరెక్టర్ త్రినాధరావుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లని  బ్యాన్ చేయాలని ప్రేక్షకులు త్రినాధరావు నక్కినపై ఫైర్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: