తాజాగా బ్రహ్మాజీ మల్టీప్లెక్సులో సినిమా టికెట్ రేట్ల కంటే అక్కడ పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేటే ఎక్కువగా ఉంటుందని ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు సినిమా టిక్కెట్ ల రేట్ ల గురించి మాట్లాడినవారు చాలా మంది ఉన్నారు కానీ.. థియేటర్స్ లో ధరలపై ఎందుకు? అని ఏ ఒక్కరూ ప్రశ్నించరని అన్నారు. ప్రభుత్వాలు కూడా ఈ దారుణాన్ని చూసీ చూడనట్టే ఉంటాయని తెలిపారు.
అతను సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. 'మూడు పాప్ కార్న్‌లు, ఓ డ్రింక్ తీసుకుంటే ఏకంగా రూ. 1300 అవుతోంది' అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్ మీద ఓ నెటిజన్ 'మీకేంటి.. మీరు వాటిని కొనుక్కుని తినగలిగే స్థాయి ఉంటుంది. అందుకే నేను మల్టీ ప్లెక్సుల్లోకి వెళ్లడమే మానేశాను' అని కామెంట్ చేశాడు. దానికి 'ఇక్కడ కొనగలిగే స్థాయి గురించి కాదు.. వాటికి అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు.. అది అంత వర్త్ కాదు అని అంటున్నా' అని బ్రహ్మాజీ అతడికి రిప్లై ఇచ్చాడు.