ప్రీతి జింటా ఈ హీరోయిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రీతి జింటా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. ఒకానొక సమయంలో తెలుగు సినిమాలలో టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమాతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రీతి జింటా వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. గత కొన్ని రోజుల నుంచి రీఎంట్రీకి రెడీ అవుతుంది. 

తాజాగా ప్రీతి జింటా సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ షేర్ చేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆమె స్పందించారు. ఇలాంటి దుస్థితిని చూడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని ప్రీతి అన్నారు. మా చుట్టూ ఉన్నవారిని మంటలు ధ్వంసం చేస్తాయని ఎప్పుడూ అనుకోలేదని ప్రీతి చెప్పారు.


నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అనేకమంది వారి ఇళ్ళను కోల్పోయారు. దీనిని చూస్తుంటే నా హృదయం చాలా బాధేస్తుంది అంటూ ప్రీతి జింటా ఎమోషనల్ అయ్యారు. మంటల్లో అన్నీ కోల్పోయిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అగ్నిమాపక సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. గాలి వేగం తగ్గి మంటలు త్వరగా అదుపులోకి రావాలని ప్రార్థిస్తున్నాను. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రీతి చెప్పారు. జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వేలాది ఇల్లు బూడిద కాగా, 13 మంది ప్రాణాలను కోల్పోయారు.

సుమారు 12,000 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రస్తుతం ప్రీతి జింటా తన భర్త జీన్ గుడేనఫ్ ను వివాహం చేసుకున్న అనంతరం సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను పొందారు. తన భర్త పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రీతి జింటాకి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. ప్రీతి జింటా సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పుడు చేరువలో ఉంటారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: