ఇదిలా ఉండగా, తాజాగా స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన సినిమా ఎలా ఉందో అని తన ఫ్యాన్స్‌ని అడిగి తెలుసుకున్నారు. స్వయంగా బాలకృష్ణ తన అభిమానులకు ఫోన్ కాల్ చేశారు. ఇక ఆయన కాల్ చేసి అభిమానులతో మాట్లాడిన ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా రెస్పాన్స్‌పై బాలయ్య బాబు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
బాలకృష్ణ అభిమానులతో ఫోన్ కాల్ లో ఏం మాట్లాడరో ఇప్పుడు తెలుసుకుందాం. కాల్ చేసి సినిమా ఎలా ఉంది అని బాలయ్య అడగ్గానే.. ఓ అభిమాని 'కంగ్రాట్యులేషన్స్ అన్న గారు సూపర్ ఉంది సినిమా. మీ నటన మాత్రం నట విశ్వరూపం. అసలు ఫస్టాఫ్ చాలా పీక్ అన్నగారు. సెకండాఫ్ సెటిల్ యాక్టింగ్ చాలా బావుంది. ఒన్ మ్యాన్ షో అన్నగారు మీది. ప్లస్ థమన్ గారి బీజీఎం అదిరిపోయింది. బాబీ గారి టేకింగ్, విజువల్స్ అన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది మీ కెరీర్‌లో' అంటూ ఓ ఫ్యాన్ చెప్పారు. దానికి బాలయ్య 'వెరీ గుడ్ సంతోషం. థాంక్యూ అమ్మా.. మీకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. పేరుపేరున ఇంటిల్లిపాదికి సకుటుంబ సపరివార సమేతంగా అందరికీ నా పొంగల్ శుభాకాంక్షలు' అంటూ విష్ చేశారు.