బిగ్ బాస్ ఈ షోకు ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మొద‌ట్లో హాలీవుడ్ లోనే ఈ షో ఉండ‌గా ఆ త‌ర‌వాత హిందీలోనూ మొద‌లు పెట్టారు. రేటింగ్ ఓ రేంజ్ లో ఉండ‌టంతో ఇత‌ర భాష‌ల్లోనూ షురూ చేశాడు. ఈ క్ర‌మంలోనే తెలుగులోనూ బిగ్ బాస్ మొద‌లు పెట్ట‌గా ఎంతోమంది ఈ రియాలిటీ షోకు ఫిదా అయ్యారు. అయితే మొద‌ట్లో ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా ఉండ‌గా ఈ షో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో క‌ట్టిప‌డేసింది. ఆ త‌ర‌వాత నాని హోస్ట్ గా ప‌నిచేశారు. త‌ర‌వాత నాగార్జున ఎంట‌ర్ అయ్యారు. ఇప్ప‌టికీ ఆయ‌నే హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఈ షోకు చాలా మంది సెల‌బ్రెటీలు వ‌చ్చి మ‌రింత పాపులర్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ లోకి వ‌చ్చి అభిమానుల‌ను సంపాదించుకున్న బ్యూటీ కీర్తి. అందం అభిన‌యం ఉన్న ఈ బ్యూటీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతగానో ద‌గ్గ‌ర‌య్యారు. క‌న్న‌డ సీరియ‌ల్స్ లోనూ న‌టించిన దీప్తి భ‌ట్ తెలుగులో కార్తీక దీపం, మ‌న‌సిచ్చిచూడు లాంటి సీరియ‌ల్స్ లో న‌టించారు. ఇక బిగ్ బాస్ లో ఉండ‌గానే ఈ కీర్తి ఓ అబ్బాయిని ప్రేమించిన‌ట్టు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అత‌డితో బ్యూటీకి 2023లోనే ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగిపోయింది. అత‌డి పేరు విజ‌య్ కాగా ప్ర‌స్తుతం కీర్తి అత‌డితోనే ఒకే ఇంట్లో ఉంటోంది. అయితే పెళ్లి ఎప్పుడు పెళ్లి డేట్ ఎప్పుడు అనేది మాత్రం చెప్ప‌డం లేదు. ఇక ఇటీవ‌ల కాబోయే భ‌ర్త విజ‌య్ తో క‌లిసి కీర్తి ఓ పూజ‌లో పాల్గొంది. సాధార‌ణంగా హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం భార్యా భ‌ర్త‌లు పెళ్లి త‌ర‌వాత‌నే పూజ‌ల్లో క‌లిసి పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఈ జంట మాత్రం ముందే పాల్గొని ఆ ఫోటోల‌ను నెట్టింట పోస్ట్ చేసింది. ఇక ఫోటోలు చూసిన నెటిజ‌న్లు హ‌వ్వా అని ముక్కు మీద వేలేసుకుని విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టేశారు. పెళ్లి కాకుండానే ఆ ప‌నులేంటి కీర్తి అంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన బ్యూటీ... మేం ఇలా పూజ చేస్తే ఏం అవుతుంది. ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రా? విమ‌ర్శ‌లు చేసే ముందు కార‌ణాలు చెప్పండి అంటూ ఫైర్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: