ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కు దర్శకులు, హీరోలతో, హీరోయిన్స్ తో , సంగీత దర్శకులతో ఎక్కువసార్లు రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా ఈ మధ్యకాలంలో బాలకృష్ణకు బాగా కనెక్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి చెప్పాల్సిన పని లేదు. బాలకృష్ణ సినిమా అంటే చాలు పోస్టర్స్ పై ఖచ్చితంగా తమన్ పేరు కనిపించేలా చేస్తూ ఉన్నారు. అలా వీరి కాంబినేషన్ అఖండ నుంచి మొదలయ్యింది. ఈ సినిమా నుంచి వీరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడిందట.


2016లో డిక్టేటర్ సినిమాలో నటించిన బాలయ్యకు తొలిసారిగా తమ పని చేశారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ ఇవ్వడం జరిగిందట. అయితే 2021లో వచ్చిన బోయపాటి బాలయ్య కాంబినేషన్ అఖండ సినిమాకు తమను సంగీతాన్ని అందించడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే వీరసింహారెడ్డి చిత్రానికి కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కూడా భారీ స్థాయిలోనే విజయాన్ని అందుకుంది. 2023లో భగవంతు కేసరి సినిమా కి మ్యూజిక్ అందించగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు తమన్.


తాజాగా విడుదలైన డాకు మహారాజ్ సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్గా నిలుస్తున్నాయట. ఇక రాబోయే రోజుల్లో అఖండ-2 సినిమాను కూడా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నది చిత్ర బృందం దీంతో ఖచ్చితంగా ఈ సినిమాకి కూడా సంగీతాన్ని తమన్ అందిస్తారని అభిమానులు కూడా ధీమాతో వ్యక్తం చేస్తున్నారు కచ్చితంగా ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందని తెలుపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో బాలయ్య సినిమా అంటే తమన్ సంగీతం తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం అనేటట్టుగా మారిపోతోంది. మరి ఈ బాండింగ్ సినిమాలలోనే కాదు బయట కూడా తనకు తండ్రి లాంటి వారు బాలయ్య అని తమ ఎన్నోసార్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: