గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ భారీ అంచాలతో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10 న థియేటర్ల లోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అది భారీ డిజాస్టర్ అయ్యింది. దాదాపు మూడేళ్లకు వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ అంచనాలను పెంచేసింది. డైరెక్టర్ శంకర్ గత సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించగా అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మొత్తం ప్రమోషన్స్ తో కలిపి 500 కోట్లు ఖర్చు చేశారు. మొదటి రోజు 220 కోట్లతో రిలీజ్ అయ్యింది. కానీ అంత రాబట్టలేదు. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కేవలం 186 కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. రెండో రోజు కలెక్షన్స్ పై ఆసక్తి మొదలైంది.

ఈ క్రమంలో ఈ మూవీ భారీ ఓపెనింగ్ దక్కించుకుంది. రెండో రోజు జోరు తగ్గింది. గేమ్ ఛేంజర్ మూవీ రెండు రోజుల కలెక్షన్లపై అధికారిక పోస్టర్ వచ్చింది.గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.270 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రం తొలి రోజు రూ.186కోట్ల గ్రాస్ సాధించినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. దాంతో రెండో రోజు రూ.84 కోట్లు వచ్చినట్టు అయింది. ఈ లెక్కల ప్రకారం తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో ఏకంగా రూ.102కోట్ల డ్రాప్ కనిస్తోంది. రెండు రోజుల మధ్య సగానికి పైగా కలెక్షన్లలో డ్రాప్ ఉంది. తొలి రోజుతో పోలిస్తే వసూళ్ల లెక్కల్లో భారీ తేడా ఉంది.అయితే, ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీకి రెండో రోజు కలెక్షన్లలో ఇంత తేడా కనిపించడంతో మరోసారి చర్చ సాగుతోంది. తొలి రోజు తేడాను కవర్ చేసేందుకు మేకర్స్ రెండో రోజు భారీ డ్రాప్‍ను చూపిస్తున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: