ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్నది ఒకే ఒక్కటి..అదే కార్చిచ్చులో లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా లు కాలిపోవడం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ కార్చిచ్చు గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఎంతోమంది హాలీవుడ్ ప్రముఖుల ఇల్లు కాలిపోతున్నాయి. చాలామంది ప్రాణాలు వదులుతున్నారు. ఇంకొంత మంది గాయాలతో బయటపడుతున్నారు. కోట్లకు కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు కళ్ళముందే కాలిపోతుండడంతో అవి చూసి వారు పడే బాధ వర్ణతాతీతం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే హాలీవుడ్ లో ఉన్న పలువురు సెలెబ్రెటీల ఇల్లు కార్చిచ్చులో దగ్ధమైపోయాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మందిని ఆ కార్చిచ్చు  నుండి కాపాడారు. అయితే తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్ ఏంజెల్స్ లోని కార్చిచ్చు లో కాలిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక విషయంలోకి వెళ్తే.. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా వంటి ప్రదేశాలలో ఎన్ని సహాయక చర్యలు జరిగినా ఎంతమంది మంటలు అర్పడానికి ప్రయత్నాలు చేస్తున్న కూడా ఆ మంటలు ఆగడం లేదు. గాలి వేగం ఎక్కువగా ఉండడంతో త్వర త్వరగా ఇల్లు అన్నీ అంటుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం జరిగింది.కోట్ల భవనాలన్నీ మంటల్లో కాలి బూడిదగా మారిపోయాయి. అయితే ఈ మంటలు ప్రస్తుతం బ్రెంట్వుడ్ వైపు విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఆ ప్రాంతంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆర్నాల్డ్, లిబ్రోన్ జేమ్స్ వంటి వారి ఇల్లు కూడా ఉన్నాయి.అయితే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాసెంజల్స్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రియాంక చోప్రా ఇంటి వరకు ఆ మంటలు విస్తరించాయట. ఇక ఆ మంటలను ఆర్పడానికి సహాయక సిబ్బంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. రీ

సెంట్ గానే ప్రియాంక చోప్రా ఇంటి దగ్గరి వరకు మంటలు వ్యాపించినట్టు ఎక్స్ వేదికగా ఒక వీడియో వైరల్ అయింది. అయితే గాలి వేగం ఎక్కువగా ఉండటంతో అవి ప్రియాంక చోప్రా ఇంటి వరకు వచ్చేసినట్టు తెలుస్తోంది. వాటిని ఆపడానికి పలువురు అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ఇంకా ఆమె ఇంటి వరకు మంటలు వ్యాపించలేదు. కానీ లాసెంజల్స్ లో ఉన్న ప్రియాంక చోప్రా ఇల్లు మంటల్లో పూర్తిగా కాలిపోయింది అంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు.కానీ ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. ఆమె ఇంటి వరకు మంటలు వ్యాప్తి చెందినట్లు మాత్రమే తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: