కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున "మన్మధుడు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో సోనాలి బింద్రే , అన్షు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో అన్షుకు మంచి గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చింది. దానితో ఈమెకు పలు తెలుగు సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఈమె నటించిన ఏ తెలుగు సినిమా కూడా మన్మధుడు స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో మెల్లిమెల్లిగా ఈమె క్రేజ్ పడిపోతూ వచ్చింది.

అలాగే అవకాశాలు కూడా తగ్గాయి. దానితో ఈమె సినిమా ఇండస్ట్రీ కి దూరం కూడా అయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది అని కూడా వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె హైదరాబాద్ కి వచ్చి ఓ పెద్ద పార్టీని కూడా ఇచ్చి అనేక మంది ఫ్రెండ్స్ ను కూడా పిలిచినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈమె సినిమా అవకాశాల కోసమే ఆ పార్టీని ఇచ్చింది అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈమె ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తుంది. 

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన "మజాకా" అనే సినిమాను రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో అన్షు కూడా నటిస్తుంది. నిన్న ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అందులో పెళ్లికూతురు గెటప్ లో అన్షు ఉంది. అలాగే ఈమె ఈ సినిమాలో యశోద అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా కనుక మంచి విజయం సాధించి ఈమె పాత్రకు మంచి క్రేజ్ వచ్చినట్లయితే మళ్లీ ఈమెకు సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో అద్భుతమైన అవకాశాలు వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: