గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాలతో వచ్చి పెద్ద డిజాస్టర్ అయింది అని ఇప్పటికే సినిమాకి నెగటివ్ టాక్ లు మనం చూస్తేనే ఉన్నాం.అయితే కొంత మంది పనికట్టుకొని మరీ ఈ సినిమాకి పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇక ఎవరు ఎంత ప్రచారం చేసినా వచ్చే కలెక్షన్లు మాత్రం ఆగవు అన్నట్లు మొదటి రోజు 186 కోట్లు వచ్చినట్టు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో గేమ్ సెంటర్ 270కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.దీంతో ఈ పోస్టర్ పై చాలా మంది నెటిజెన్స్ అవమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు డిజాస్టర్ టాక్ ఈ కలెక్షన్లు ఏంటి స్వామి..డిజాస్టర్ టాక్ వచ్చి మరి ఇన్ని కలెక్షన్లు వచ్చాయా..ఇన్ని టికెట్లు అమ్ముడుపోయాయి అంటే ఎవరైనా నమ్ముతారా..సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది.. కానీ పోస్టర్లలో మాత్రం కోట్లకు కోట్లు కలెక్షన్లు వచ్చినట్టు వేస్తున్నారు.

మరీ ఇంత ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయంటే నమ్మశక్యంగా ఉందా అంటూ సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.అంతే కాదు మొదటి రోజు 186 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేసిన కూడా చాలామంది అది ఫేక్ కలెక్షన్స్ అంటూ కొట్టి పారేశారు.అయితే తాజాగా ఈ ఫేక్ కలెక్షన్స్ పై రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీ మేకర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే మొదటి రోజు 186 కోట్ల కలెక్షన్స్ వచ్చిన దాంట్లో ఎలాంటి నిజం లేదని, కనీసం 80 కోట్లు కూడా దాటకముందే 186 కోట్లు అంటూ పోస్టర్ వేసేసారు.ఆ పోస్టర్లో ఉంది పూర్తిగా అబద్ధమే..86 కోట్లు వస్తే 100 కోట్లు ఆడ్ చేశారు అనే ప్రచారం కూడా జరిగింది.అయితే ఈ విషయంలో రామ్ చరణ్ కూడా అసహనంగా ఉన్నారట. గేమ్ ఛేంజర్ మూవీ మేకర్స్ కి కాల్ చేసి ఏంటి మీరు ఇలా ఎన్ని పడితే అన్ని కలెక్షన్లను పోస్టర్లలో వేస్తున్నారు.. 

ఇలా అసత్యపు ప్రచారాలు చేయకండి.. బుద్ధిలేని వాళ్ళు చేస్తే మనం కూడా ఇలా దుష్ప్రచారం చేద్దామా..ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో అన్ని కలెక్షన్స్ మాత్రమే పోస్టర్లలో వేయండి.రికార్డులు రాకపోయినా పర్వాలేదు కానీ అభిమానులను మాత్రం మోసం చేయకండి..సినిమా బాగుంటే వాళ్లే సినిమాకి వస్తారు. కానీ మీరు ఇలా లేనిపోని ప్రచారాలు చేస్తూ సినిమాపై హైప్ పెంచాలని చూడకండి.ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు అంటూ గేమ్ ఛేంజర్ మేకర్స్ కి రామ్ చరణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సినీ సర్కిల్స్ లో రూమర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ డిజాస్టర్ టాక్ తో గేమ్ ఛేంజర్ అన్ని కోట్ల కలెక్షన్స్ సాధించింది అంటే ఎవరు నమ్మడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: