జాన్వీ కపూర్ కూడా భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంది . అయితే ఒక తెలుగు హీరో జాన్వికపూర్ ని స్పెషల్ గా సంక్రాంతికి ఇంటికి రమ్మంటూ ఆహ్వానించారట. ఆ హీరో మరెవరో కాదు "రామ్ చరణ్ " అంటూ తెలుస్తుంది . ప్రజెంట్ జాన్వి కపూర్ - రాంచరణ్ తో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుంది ..ఈ సినిమా షూటింగ్లో బాగా బిజీ అయిపోయారు. ఈ మూమెంట్ లోనే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా బాగా స్ట్రాంగ్ గా మారిందట. గతంలో శ్రీదేవి - చిరంజీవి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కన్నా కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా ముదిరిపోయిందట .
ఈ క్రమంలోనే జాన్వి కపూర్ ని సంక్రాంతికి ఇంటికి ఇన్వైట్ చేశాడట రామ్ చరణ్ . అంతేకాదు ప్రతి సంక్రాంతికి కూడా మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట చేరి సందడి చేస్తుంది. ఇదే క్రమంలో జాన్వీ కపూర్ ని స్పెషల్ గా రామ్ చరణ్ ఆహ్వానించడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి . కాగా రీసెంట్గా రాంచరణ్ నటించిన "గేమ్ చేంజర్" సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది . కొంతమంది సినిమా కథ బాగుంది .. నటన పరంగా చరణ్ అద్భుతంగా నటించాడు అంటుంటే మరికొందరు మాత్రం అంత సీన్ లేదు.. ఒక గ్లోబల్ హీరో నటించాల్సిన పద్ధతేనా ఇది అంటూ మండిపడుతున్నారు. సినిమా మాత్రం హ్యూజ్కలెక్షన్స్ సాధిస్తున్నట్లు చిత్ర బృందం చెప్పుకొస్తున్నారు . దీంతో అసలు ఈ సినిమా హిట్టా..? ఫట్టా..? అనేది జనాలకి కూడా ఒక క్లారిటీ రాలేదు..!