మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రలలో నటించాడు. ఈ మూవీలో చరణ్ ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. ఇక తండ్రి పాత్రలో నటించిన చరణ్ కు జోడిగా అంజలి నటించగా , కొడుకు పాత్రలో నటించిన చరణ్ కి జోడిగా కియార అద్వానీ నటించింది. ఈ మూవీ లో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించగా ... శ్రీకాంత్ , సునీల్ , శ్రీకాంత్ , రాజీవ్ కనకాల , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 10 వ తేదీన విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు రోజు వారీగా హిందీ లో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు ఈ మూవీ కి వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ మూవీ కి హిందీ ఏరియాలో 7.44 కోట్ల కలెక్షన్లు రాగా , రెండవ రోజు ఈ సినిమాకు హిందీ ఏరియాలో 7.24 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడవ రోజు ఈ సినిమాకు హిందీ ఏరియాలో 8.04 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి హిందీ ఏరియా నుండి 22 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఈ మూవీ హిందీ ఏరియా నుండి మంచి కలెక్షన్లను రాబడుతుంది. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి హిందీ ఏరియా నుండి ఏ స్థాయి కలెక్షన్లు వస్తాయో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: