ప్రతి ఏడాది సంక్రాంతికి ఎన్నో చిత్రాలు విడుదలవుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాయి. అలాగే అభిమానులు కూడా సంక్రాంతి పండుగ కోసం తమ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే చాలు పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఉంటారు. అయితే 2025 సంక్రాంతిలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10వ తేదీన విడుదలై మిక్స్డ్ టాకుతో ఉన్నది.
నిన్నటి రోజున బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. 14వ తేదీన వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా పరిస్థితి చూడాలి.



అయితే సంక్రాంతి పండుగ కావడం చేత చాలామంది యువత, అలాగే ఇతర ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు కూడా తమ సొంత ఊర్లకి వెళ్లిపోయారు.. దీంతో సినిమా థియేటర్లకు చాలా గండి పడినట్టుగా కనిపిస్తోందట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఇప్పటివరకు సంక్రాంతికి విడుదలైన సినిమాలకు ప్రజలు షాక్ ఇచ్చారు థియేటర్స్ చాలా చోట్ల ఖాళీగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది అదేమిటంటే థియేటర్లు ఖాళీగా ఉండడం చేత ప్రజలు సంక్రాంతికి ఊరికి వెళ్లారా లేకపోతే సినిమాలు అంటే ఇష్టం తగ్గిపోయిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా నిన్నటి రోజున విడుదలైన డాకు మహారాజ్ థియేటర్స్ కి నిన్నటి రోజున చాలాచోట్ల ఖాళీగానే కనిపించాయట. హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్న బాలయ్య నుంచి సినిమా వచ్చినా కూడా ఆ సందడి ఎక్కడ కనిపించడం లేదట. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాలలో అటు గేమ్ ఛేంజర్, డాకు మహారాజు సినిమాలకు చాలా చోట్ల థియేటర్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయట. చాలామంది ఇప్పుడు తమకు కావలసిన చోట్ల బుక్ మై షో లో టికెట్లు దొరకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా చాలామంది ప్రజలు థియేటర్లకు వెళ్లడం కంటే సంక్రాంతికి ఊరికి వెళ్లడమే బెటర్ అన్నట్లుగా భావిస్తున్నారట. మరి ఇలాగే అధిక ధరలు, థియేటర్లో స్నాక్స్ వంటి డబ్బులు అధిక భారం అవ్వడం వల్ల చాలామంది వెళ్లలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: