అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు అఖండ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి , భగవంత్ కేసరి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాగా రీసెంట్గా "డాకు మహారాజ్" సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య . బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు 30 కోట్లు కలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
కాగా బాలయ్య "డాకు మహారాజ్" సినిమా హిట్ అవ్వడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా బాలయ్య పేరు మారుమ్రోగిపోతుంది . అంతేకాదు బాలయ్య సీనియర్ హీరో అయినా సరే ఆయన నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ 100 కోట్ల క్లబ్లో చేరిపోతున్నాయి. అయితే చాలా యంగ్ ఏజ్ ఉన్న హీరోస్ ..పాన్ ఇండియా హీరో సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ దక్కించుకుంటున్నాయి . మరీ ముఖ్యంగా సంక్రాంతి రేసులో నిలుచున్న గేమ్ చేంజర్ సినిమా ఎలా మిక్స్డ్ టాక్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే .
అంతే కాదు ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఆయనే నెంబర్ వన్ హీరో అంటూ తెగ పోగిడేస్తున్నారు. అయితే సీనియారిటీ ఏజ్ లోను బాలయ్య ఈ విధంగా ఇండస్ట్రీని ఏలేయడానికి కారణం ఆయనకు ఇండస్ట్రీపై ఉన్న ప్రేమ అని నటన పట్ల ఆయనకున్న ఆసక్తి అని.. ఏ పనైనా సరే భారంగా కాదు ఇష్టంగా చేయాలి అన్నదాన్ని ఎక్కువగా నమ్ముతాడు బాలయ్య అని .. ఆ కారణంగానే ఆయన నటించిన సినిమాలు ఇంత పెద్ద హిట్ అవుతున్నాయి అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!