బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రేంజ్ లో షేర్ కలెక్షన్లు సాధించడం సులువైన విషయం కాదు. అయితే డాకు మహారాజ్ సినిమాకు సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాలతో పోల్చి చూస్తే బెటర్ టాక్ రావడం కలిసొచ్చిందని చెప్పవచ్చు. డాకు మహారాజ్ టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.
 
ఈ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్లకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సితార నిర్మాతలకు సంక్రాంతి సీజన్ ఎంతగానో కలిసొచ్చింది. గతేడాది గుంటూరు కారం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సితార నిర్మాతలు ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
 
డాకు మహారాజ్ సినిమా సక్సెస్ అటు ప్రగ్యా జైస్వాల్ కు, ఇటు శ్రద్ధా శ్రీనాథ్ కు ప్లస్ అయింది. సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని చెప్పవచ్చు. డాకు మహారాజ్ మూవీ ఇతర భాషల్లో త్వరలో విడుదల కానుండగా అక్కడ కూడా ఈ సినిమా సత్తా చాటే ఛాన్స్ ఉంది. డాకు మహారాజ్ మూవీ కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.
 
డాకు మహారాజ్ మూవీ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య నెక్స్ట్ లెవెల్ కథాంశంతో తెరకెక్కింది. డాకు మహారాజ్ సినిమా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ సినిమాలలో స్పెషల్ సినిమాగా నిలిచి కలెక్షన్ల విషయంలో సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.
 


మరింత సమాచారం తెలుసుకోండి: