టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల లో ఒక రు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే గతంలో వెంకటేష్ , అనిల్ రావిపూడి , దిల్ రాజు కాంబోలో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

దానితో వీరి కాంబోలో వస్తున్నా సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాను రేపు అనగా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. టికెట్ బుకింగ్ యాప్ అయినటువంటి బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ లాస్ట్ 24 గంటల్లో అద్భుతమైన రేంజ్ లో సేల్ అయ్యాయి.

తాజాగా బుక్ మై షో ఆప్ వారు ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ లాస్ట్ 24 గంటల్లో 149.04 సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బుక్ మై షో లో అద్భుతమైన రేంజ్ లో జోష్ చూపిస్తుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి టాక్ ను తెచ్చుకొని ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: