టైం బాగోలేకపోతే అంతే లక్ష్మీదేవి ఇంటి ఎదురుగా వచ్చిన రాహుకాలం ఉంది కొంచెం సేపు బయట నిల్చో అని చెప్పే టైప్ ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు.  వాళ్ళల్లో ఒకరే ఈ తెలుగు హీరో . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ సో కాల్డ్ తెలుగు హీరో . అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని తన నటనతో ఏలేసిన ఈయన ఇప్పుడు వచ్చిన సినిమాలలో అవకాశాలు అందుకుంటూ అరాకోరా ముందుకు వెళ్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా ప్రజెంట్ పాపులారిటీ లేదు .


అయితే బాబీకి ఈ హీరో అంటే మొదటి నుంచి స్పెషల్ గౌరవం . ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాడు అంటూ ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . కాగా డైరెక్టర్ బాబి తాజాగా తెరకెక్కించిన సినిమా "డాకు మహారాజ్". టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తో ఈ సినిమాను తెరకెక్కించాడు . సినిమా వేరే లెవెల్ . సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. ఆయన నటనను చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటూ తెగ పొగిడేస్తున్నారు.



అయితే బాలయ్య కంటే ముందే ఈ డాకు మహారాజు మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్ద హీరో చేతికి వెళ్లిందట . అయితే ఆ హీరో సినిమాలో టూ వైలెన్స్ ఉంది అంటూ కథను రిజెక్ట్ చేశారట . ఇంత వైలెన్స్ తన బాడీ ఫిజిక్కి సెట్ కాదు అని .. ఫ్యామిలీ సెంటిమెంట్ పరంగా ఓకే బట్ టూ వైలెన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయను అని బాబి స్పెషల్గా రాసుకున్న కథను రిజెక్ట్ చేశారట . అంతే కాదు వైలెన్స్ సీన్స్ కొన్ని తీసేస్తే సినిమాలో నటించిన డానికి ట్రై చేస్తాను అంటూ కూడా ఆఫర్ ఇచ్చారట .



కానీ బాబీ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. ఎంతో ఇష్టంగా ఈ సీన్స్ ను తెరకెక్కించాలి అని ఆశపడ్డారట . ఈ కారణంగానే ఆ హీరో రిజెక్ట్ చేయడంతో బాలయ్య వద్దకు వెళ్లి కధ వినిపించగా బాలయ్య స్పాట్లోనే సంతకం చేసేసారట . ఏ మాటకు ఆ మాటే డాకు మహారాజు మూవీ లో బాలయ్యను తప్పిస్తే వేరే ఏ తెలుగు హీరోని ఊహించుకున్న ఆ మూవీ ఫ్లాప్ అయి ఉండేది . అసలు ఊహించుకోలేం . డాకు మహారాజ్ అంటే బాలయ్య ,, బాలయ్య అలా సెట్ అయిపోయాడు అంతే ..ఇక ఎవ్వరు బాలయ్యను ఢీకొట్టలేడు అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: