టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ  మనస్తత్వం గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం ఎక్కడో ఒకచోట బయట పడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆయనతో సినిమాలలో పనిచేసిన కొంతమంది నేరుగా బాలయ్య మంచి మనసు గురించి చెబితే, మరి కొంతమంది ఆయనను దగ్గరగా చూసినవారు కూడా ఆయన గురించి చెబుతూ ఉంటారు. అయితే బాలయ్య మనసు పిల్లల మనస్తత్వం లాంటిది అని ఇప్పటికే ఎంతోమంది తెలియజేశారు. ఇక ఆ మనస్తత్వానికి కనెక్ట్ అయిన పిల్లలు, ఆయన నుంచి వెళ్లిపోవాలంటే కంటతడి పెట్టుకుంటారు. ఇప్పుడు సరిగ్గా డాకు మహారాజ్ షూటింగ్ లాస్ట్ రోజు కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ వేద కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఈ క్రమంలో నే చైల్డ్ ఆర్టిస్ట్ వేద అగర్వాల్ మూవీలో మొదట గంట వరకు ఈ సినిమాలో కథను మలుపు తిప్పే రోల్‌లో సెంటిమెంట్‌తో చాలా బాగా అలరించింది. ఈ క్రమంలోనే సినిమాలో కీలక పాత్ర పోషించిన చిన్నారి పై ప్రశంసలు వస్తున్నాయి.ఈ సందర్బంగా ఆ పాప ఎవరు, బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు.

ఇదిలావుండగా ఈ పాప పేరు వేదా అగర్వాల్. ఆమె తండ్రి మాధవ్ సింగర్. మ్యూజిక్ కంపోజర్ కాగా, తల్లి మేఘ హౌస్ వైఫ్. మాధవ్ గజల్, భజన్, తుమ్రి లో ప్రవీణ్యుడు. ఈ క్రమంలోనే ఐఐయమ్ఏ అవార్డుల్లో బెస్ట్ మేల్ సింగర్ గా నామినేట్ అయ్యారు.ఇదిలావుండగా అసలువిషయానికొస్తే వేద  చిన్నారి బాలయ్యను విడిచి వెళ్లలేక కన్నీరు పెట్టుకుంది. ఆ పాపని చూస్తుంటే నిజంగా మనకు కూడా కన్నీరాగదు. దీన్ని బట్టి చూస్తే ఆ పాప బాలకృష్ణతో ఎంతలా బాండింగ్ ఏర్పరుచుకుందో అర్థమవుతుంది. ఆ వీడియోలో బాలకృష్ణను వదిలి వెళ్ళలేక ఆయనను హత్తుకొని మరీ ఏడుస్తోంది వేద. ఇక చివరికి బాలకృష్ణ ఆ పాపకు దీవెనలు ఇచ్చి, ఏదో ప్రామిస్ చేసినట్లు కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత తన మాటలతో ఆ పాపను నవ్వించారు బాలయ్య. చివరిగా పాపకు ముద్దు పెట్టి ఆమెను సంతోషంగా వారి తల్లిదండ్రులతో పంపించిన వీడియో మనం చూడవచ్చు .దీన్ని బట్టి చూస్తే వేద ఈ చిన్నారి బాలకృష్ణకు ఎంతలా కనెక్ట్ అయిందో చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇది చూసిన బాలయ్య అభిమానులు మాత్రం మా బాలయ్య బాబు హార్ట్ నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: